నిజామాబాద్, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మున్సిపల్ సర్వసభ్య సమావేశం నగర మేయర్ నీతూ కిరణ్ అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేశారు. సమావేశానికి నగర శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్త, రూరల్ శాసన సభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూర్ శాసన సభ్యులు జీవన్ రెడ్డి, ఏమ్మెల్సీ వి.జి. గౌడ్, డి. రాజేశ్వర్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ జితేశ్. వి. పాటిల్ పాల్గొన్నారు.
సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలను ప్రవేశపెట్టి చర్చించి ఆమోదం పొందడం జరిగిందని మేయర్ తెలిపారు. నగర ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించడానికి పొరుగు సేవల ద్వారా ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేయుటకు డ్రైవర్లను మరియు పారిశుద్ధ్య నిర్వహణకు కార్మికులను తీసుకోవటానికి ప్రవేశపెట్టిన బిల్లును ఆమోదించడం జరిగిందని, కొత్త సంవత్సరంలో ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా నగరంలో పారిశుధ్య నిర్వహణకు ఆటోలను మరియు ట్రాక్టర్లను సుమారు 3కోట్ల నిధులతో కొనుగోలు చేయుటకు ఆమోదం తెలిపారన్నారు.
పట్టణ ప్రగతి నిధులతో నగరంలో మెరుగైన సౌకర్యాలు కల్పించటానికి చెత్త నిర్మూలనకు, చెత్త వేరుచేసే యంత్రాన్ని కొనుగోలు చేయటానికి ఆమోదం తెలిపారన్నారు. వివిద ప్రాంతాల నుండి అనేక కారణాల ద్వారా నగరానికి వచ్చే ప్రజలకు, నగర ప్రజల సౌకర్యార్థం నగరంలో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతను టౌన్ లెవెల్ ఫెడరేషన్ వారికి అప్పగించడం జరిగిందన్నారు. నగరంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు నగర సుందరీకరణకు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందన్నారు. సమావేశంలో పాల్గొని అభివద్ధికి దోహదం చేసే బిల్లులకు ఆమోదం తెలిపిన శాసన సబ్యులకు, శాసన మండలి సబ్యులకు కార్పొరేటర్లకు అధికారులకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- రూ.50 వేల విలువచేసే గుట్కా స్వాధీనం - January 19, 2021
- టీఎస్ఐపాస్ అండ్ డిస్టిక్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం - January 18, 2021
- తెలంగాణ పాడి రైతన్నకు ప్రోత్సాహక లబ్ది - January 18, 2021