Breaking News

జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ ప్రారంభం

నిజామాబాద్‌, జనవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే శుక్రవారం డ్రై రన్‌ పూర్తి చేసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో కోవ్యాక్సిన్‌ డ్రై రన్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పిహెచ్‌సిలు, యుపిహెచ్‌సిలు, సిహెచ్‌సిలలో, 42 సెంటర్లలో డ్రై రన్‌, 16 సెంటర్లలో సాఫ్ట్‌ వేర్‌ కూడా పర్సన్‌ను అసైన్డ్‌ చేసిందన్నారు. వ్యాక్సి నేషన్‌ రోజు కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్నామని అదేవిధంగా ఈ 16 సెంటర్లలో సాప్ట్‌వేర్‌ను ఉపయోగించి చేయడం జరుగుతుందన్నారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదట మూడు కేటగిరీల వాళ్లకు ఫస్ట్‌ ఫేస్‌లో వ్యాక్సిన్‌ చేయబోతున్నామన్నారు. వాటికి సంబంధించి గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి కోవిడ్‌ వెబ్‌ సైట్‌ ఇవ్వడం జరిగిందని, వెబ్‌ సైట్‌లో మీరు వివరాలు రిజిస్టర్‌ చేయాలని, ఇప్పటివరకు నిజామాబాద్‌ జిల్లాలో 11,800 లు సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేయడం జరిగిందన్నారు. ఫస్ట్‌ ప్లేస్‌ హెల్త్‌ సెక్టార్‌లో పనిచేస్తున్న వారు డాక్టర్స్‌ నుండి సెక్యూరిటీ గార్డ్‌ వరకు, ప్రైవేటులో హెల్త్‌ వర్కర్స్‌కు, సెకండ్‌ అంగన్‌వాడి టీచర్స్‌ వర్కర్స్‌కు, శానిటేషన్‌ వర్కర్స్‌ జిపిలో పనిచేస్తున్న వారికి, మున్సిపాలిటీలో పనిచేస్తున్న వారికి ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.

పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని సైట్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని వ్యాక్సిన్‌ ఇచ్చే రోజు పేరు వెబ్సైట్‌లో నమోదైన వారికి మాత్రమే వ్యాక్సిన్‌ మొదట ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యాక్సిన్‌ ఏర్పాట్లు పీహెచ్‌సిలలో యుపిహెచ్‌సి హెచ్‌ మెడికల్‌ కాలేజ్‌ హాస్పిటల్‌లో ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో బోధన్‌ జిల్లా హాస్పిటల్‌లో చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటితో పాటు నాలుగు ప్రైవేటు హాస్పిటల్స్‌లో కూడా వ్యాక్సిన్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వంద మంది కంటే ఎక్కువ వర్కర్స్‌ ఉన్న ప్రైవేటు హాస్పిటల్‌ సెంటర్లను మంజూరు చేస్తున్నామన్నారు. నిజామాబాద్‌లో 4 హాస్పిటల్స్‌లో వ్యాక్సిన్‌ చేసే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. కోవిడ్‌ ప్రోటో కాల్‌ పాటిస్తూ చేస్తామన్నారు. ఇప్పటికే చాలా రకాల వ్యాక్సిన్స్‌ ప్రజలకు ఇస్తున్నామని అన్నీ కూడా ప్రతి బుధ, శనివారాల్లో గ్రామాలలో తిరుగుతూ ఇస్తున్నారని వారికి ప్రత్యేకంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ మీద ట్రైనింగ్‌ ఇప్పటికే ఇచ్చామని వారి ద్వారా వ్యాక్సిన్‌ ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఇచ్చిన తర్వాత 30 నిమిషాలు అబ్జర్వేషన్‌ రూమ్‌లో ఉంచడం జరుగుతుందన్నారు. క్రిటికల్‌ కేసులు వస్తే గ్రూప్‌ ఆఫ్‌ డాక్టర్స్‌ ఉంటారన్నారు. రెండవ ఫేసులో 60 ఏళ్లు దాటిన వారికి, మూడవ ఫేస్‌లో కామన్‌గా అందరికీ ఇవ్వడం జరుగుతుందన్నారు.

నిజామాబాద్‌ జిల్లాలో ప్రభుత్వం ఏదైతే వ్యాక్సిన్‌ అందరికీ అందించాలని కోరుకుంటుందో ఎవరికీ ఇబ్బంది కాకుండా జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ సుదర్శనం, డిస్టిక్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ ప్రతిమరాజ్‌, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.

Check Also

వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ ...

Comment on the article