Breaking News

నిలిచిన పనులు వేగంగా పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జనవరి 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవీడు కారణంగా నిలిచిన పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించిన సంక్షేమ పాఠశాలల నిర్మాణాల పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని పనులు ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తిచేయాలని, ఏమైనా సమస్యలుంటే తమ దష్టికి తేవాలని జిల్లా యంత్రాంగం మీకు పూర్తిగా సపోర్ట్‌గా ఉంటుందన్నారు.

ప్రారంభం కాని పనులు ఉంటే సంక్రాంతి తర్వాత వెంటనే ప్రారంభించాలని జూన్‌ మొదటి వారం వరకు పనులు పూర్తి చేయడానికి కషి చేయాలని సూచించారు. కరోనా వల్ల 9 నెలలు పనులు పెండింగ్‌ అయినవని, పనులు ఐదు నెలల్లో వేగంగా పూర్తి కావాలని అన్నారు. కార్యక్రమంలో డిటిడబ్ల్యువో అంబాజీ, డిఈ అంజన్‌ కుమార్‌, ఏఈ సంపత్‌, ఏఆర్‌సి సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని బైక్‌ ర్యాలీ

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ ...

Comment on the article