నిజామాబాద్, జనవరి 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు నిజామాబాద్ తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో ఈనెల 11న సోమవారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ నగరంలోని కలెక్టర్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలంగాణ జాగతి మహిళా అధ్యక్షురాలు నాయక్వాడి అపర్ణ తెలిపారు. ముగ్గుల పోటీల్లో నిజామాబాద్ నగరంతోపాటు జిల్లాలోని మహిళలందరూ పాల్గొనాలన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు నగదు బహుమతి ఉంటుందని తెలిపారు.
మొదటి బహుమతి ఐదువేల రూపాయలు, రెండవ బహుమతి మూడువేల రూపాయలు, మూడవ బహుమతి రెండు వేల రూపాయలు అని తెలిపారు. పోటీల్లో పాల్గొనే రంగులు, రంగోలి సామగ్రి తమ వెంట తెచ్చుకోవాలన్నారు. పోటీ దారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని, విధిగా మాస్కులు ధరించి, శానిటైజర్ వెంట తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ జాగతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, జిల్లా అధ్యక్షులు అవంతి పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతాయని అపర్ణ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ జాగతి రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మీనారాయణ భరద్వాజ, నరాల సుధాకర్, నాయకులు హరీష్, గోపాల్ సందీప్, సంపత్, విక్కీ, కోయ్యాడ శంకర్, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021