Breaking News

యువజనోత్సవ పోటీలు

నిజామాబాద్‌, జనవరి 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని యువతీయువతులకు వివిధ రకాల పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నెహ్రూ యువ కేంద్ర ప్రతీ సంవత్సరం నిర్వహించే యువజన వారోత్సవాల్లో భాగంగా ఈ యేడు యువతీ యువకులకు వివిధ రకాల అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

జనవరి 12న ఉపన్యాసం, పాటల పోటి.

ఉపన్యాస పోటీ అంశం – స్వామి వివేకానంద నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన విషయాలు.

పాటల పోటీ అంశం – కేవలం దేశభక్తి గీతాలు.

జనవరి 13న ముగ్గుల పోటీ, గాలిపటాలు ఎగరేయడంలో పోటీ

ముగ్గుల పోటీ : సంక్రాంతి – సంస్కతి

జనవరి 14న చిత్రలేఖనం, వ్యాసరచన

చిత్రలేఖనం అంశం – జల సంరక్షణ

వ్యాసరచన – భవిష్యత్‌ భారతంలో యువత పాత్ర

జనవరి 16న సైకిల్‌ రేస్‌

పోటీల నియమాలు : పోటీలకు అవసరమయ్యే వస్తువులు, సామగ్రి ఎవరివి వారే తెచ్చుకోవాలని, వయసు : 18 నుంచి 29 సంవత్సరాల లోపు వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, అలాగే నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సిన ఆఖరి తేదీ : 11 జనవరి 2021 సాయంత్రం 5గంటల లోపు, మరిన్ని వివరాలకు వాట్సాప్‌ నెంబర్‌ 9717219538 లో మెసేజ్‌ చేయాలన్నారు.

అదేవిధంగా పేరు, చిరునామా, వయసు, ఫోన్‌ నెంబర్‌, మీరు పోటీ చేయదలచిన అంశం వివరాలు పంపవలసి ఉంటుందన్నారు. ప్రథమ, ద్వితీయ విజేతలకు నగదు బహుమతి, సర్టిఫికెట్‌ ఇవ్వటం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు నెహ్రూ యువకేంద్ర నిజామాబాద్‌ కార్యాలయంలో కూడా సంప్రదించవచ్చన్నారు. నెంబర్‌ 918462240979.

Check Also

నిజామాబాద్‌ తెలంగాణ ధాన్యాగారం

నిజామాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో నిజామాబాద్‌ జిల్లా ధాన్యాగారంగా ప్రఖ్యాతి గాంచినదని ముఖ్యంగా ...

Comment on the article