నిజామాబాద్, జనవరి 10
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ధాన్యాగారంగా ప్రఖ్యాతి గాంచినదని ముఖ్యంగా నిజామాబాద్ పసుపు పంటకు విశేష ప్రాధాన్యత ఉన్నదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి పార్థసారథి అన్నారు. ఆదివారం స్థానిక వంశీ ఇంటర్నేషనల్లో ఎక్సెల్ ఇండియా పత్రిక ఆధ్వర్యంలో లీడర్షిప్ మీట్ – నిజామాబాద్ గ్రోత్ ఎజెండా 2021 అనే అంశంతో నిర్వహించిన సెమినార్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
అతిథులంతా జ్యోతి ప్రజ్వలన చేసి సెమినార్ ప్రారంభించి పండిత్ నారాయణ రెడ్డి ఫోటోకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ నిజామాబాద్లో ఉత్పత్తి అయిన పసుపు ప్రపంచంలో ఎనిమిది శాతం అన్నారు. నిజామాబాద్ జిల్లా పసుపుకు మంచి డిమాండ్ ఉందని వేరే దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని కానీ డిమాండ్ మేరకు ఎగుమతి కావడం లేదని రైతులకు మరిన్ని సౌకర్యాలు కల్పించడం ద్వారా మరింత ఎగుమతి చేయడానికి వీలవుతుందన్నారు.
మన మార్కెట్కు సెకండ్ లార్జెస్ట్ డిమాండ్ ఉందన్నారు. ఈనామ్ ద్వారా ఈ పంటకు అమ్మకాలు, కొనుగోలు జరుగుతున్నాయని ఈ కార్యక్రమంలో ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ పంటలు పండించే రైతులకు మరింత లబ్ది చేకూరుతుందన్నారు. నందిపేట్, కొండారంలో ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు టేకప్ చేసినట్లయితే మరింత అభివద్ధి జరగడానికి వీలు అవుతుందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ వస్తే నిజామాబాదులో అగ్రికల్చర్కి మంచి ఫ్యూచర్ ఉందన్నారు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి మంచి ప్రాజెక్టులు వస్తాయన్నాయని, యువతకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని తెలిపారు. బీడీ ఇండస్ట్రీస్ వల్ల మహిళలకు కొంత ఉపాధి ఉందన్నారు. యువత ఐటి టవర్స్ వస్తుందని కొత్త కోర్సులు ఫీచర్స్ ఉన్న సైబర్ సెక్యూరిటీ క్లాసులు ఏర్పాటు చేయాలన్నారు. సెమినార్లో ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ టిఎస్సిహెచ్ఈ, నసీమా, రిజిస్ట్రార్, తెలంగాణ యూనివర్సిటీ, అరుణ్ రెడ్డి కషి దర్శన్ కేంద్రం నిజామాబాద్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, వాసవి రెడ్డి, కషి దర్శన్ కేంద్రం, బసంత్ రెడ్డి, మారయ్య గౌడ్, ప్రశాంత్, గోపాల్ శర్మ, మేక రామస్వామి తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021