నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని 1వ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో భారీ మొత్తంలో గుట్కా స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్ఫోర్సు సిఐ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టుకున్న గుట్కా విలువ సుమారు లక్ష రూపాయల వరకు ఉంటుందని, ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. సోమవారం నిజామాబాద్ పోలీసు కమిషనర్ కార్తికేయ ఉత్తర్వుల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ షాకేర్ అలీ, వారి సిబ్బంది 1వ టౌన్, 5వ టౌన్ పోలీసు ...
Read More »Daily Archives: January 11, 2021
కామారెడ్డిలో 16న వ్యాక్సినేషన్
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. పి. చంద్రశేఖర్ కామారెడ్డి జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో కోవిడ్ 19 నివారణకు ఈనెల 16వ తేదీ నుండి వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడానికి ఏర్పాట్ల గురించి వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డిఎం హెచ్‌వోలతో సమీక్ష నిర్వహించారు. 16న ప్రభుత్వం సూచించిన కేంద్రాల్లో కోవిడ్ 19 ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వాక్సినేషన్ చేయడం జరుగుతుందన్నారు. ...
Read More »కామారెడ్డిలో రంగోళి పోటీలు
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాగతి అధ్యక్షులు అనంత రాములు, నాయకులు చక్రధర్ సంయుక్తంగా ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం (గాంధీ గంజ్) ఆవరణలో ఉదయం 10 గంటల నుండి ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో ఏడు కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామన్నారు. అలాగే ముగ్గుల పోటీలలో పాల్గొని ప్రతిభ కనబర్చిన మహిళలకు జాగతి తరుపున ...
Read More »రైతువ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహ్మద్ ఆలీ షబ్బీర్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎత్తేసే కుట్ర చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రుభుత్వాలు అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు. రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని ఢిల్లీలో చలితో ...
Read More »తపస్ ధర్నా
కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన పిఆర్సి, ఐఆర్ వంటివి కూడా అందని ద్రాక్షలా అయ్యాయని ముఖ్యమంత్రి ప్రతి సారి ప్రకటనలకు ...
Read More »13న జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 13న ఉదయం 6 గంటలకు స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్ తెలిపారు. ఉదయం 6 గంటలకు భోగిమంటలతో కార్యక్రమం మొదలవుతుందని, తెలంగాణ జాగతి జిల్లా అధ్యక్షులు అవంతి పర్యవేక్షణలో కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమానికి జిల్లా, నగరంలోని ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణ భరద్వాజ, కొట్టూరి ...
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్లో శ్రీకాంత్ కుమార్‌కు డాక్టరేట్
డిచ్పల్లి, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో బి.ఓ.ఎస్, అసోషియేట్ ప్రొఫెసర్ డా.అపర్ణ పర్యవేక్షణలో పరిశోధకులు బి. శ్రీకాంత్ కుమార్ ”జాబ్ సాటిస్ఫేక్షన్ ఆఫ్ అంగన్ వాడి వర్కర్స్ విత్ రిఫరెన్స్ టు నిజామాబాద్ డిస్ట్రిక్ట్” అనే అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి పిహెచ్.డి. డాక్టరేట్ ప్రదానం చేయబడింది. దీనికి సంబంధించి డీన్ ఆచార్య యాదగిరి చైర్మన్ షిప్లో కమిటీ ఏర్పాటు చేసి పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథానికి గాను పరిశోధకుడికి వర్చువల్ ఆన్లైన్ ...
Read More »కామ్రేడ్ శావులం సాయిలు వర్ధంతి
బోధన్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్ డివిజన్ కమిటీ నాయకులు, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కామ్రేడ్ శావులం సాయులు 25వ వర్ధంతిని బోధన్ సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలోని పాన్‌గల్లి పోస్టాఫీసు వద్ద సోమవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బి.మల్లేష్, సుల్తాన్, సాయులు, పడాల శంకర్, జి.సీతారాం, మైబూబ్, సలీం, బి.సాయులు, గంగారాం, పొశెట్టి, సాయులు, మక్కయ్య, ...
Read More »