కామారెడ్డి, జనవరి 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా జాగతి అధ్యక్షులు అనంత రాములు, నాయకులు చక్రధర్ సంయుక్తంగా ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం (గాంధీ గంజ్) ఆవరణలో ఉదయం 10 గంటల నుండి ముగ్గుల పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరో ఏడు కన్సోలేషన్ బహుమతులు అందజేస్తామన్నారు.
అలాగే ముగ్గుల పోటీలలో పాల్గొని ప్రతిభ కనబర్చిన మహిళలకు జాగతి తరుపున బహుమతులు అందజేస్తామన్నారు. న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేస్తారని వారు తెలిపారు. పోటీలలో పాల్గొనే వారికి జాగతి తరుపున రంగులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు మంగళవారం ఉదయం 10 గంటల లోపు గంజ్ కాంపౌండ్కి చేరుకోవాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, సమయ పాలన పాటిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- జిల్లా కలెక్టర్కు సన్మానం - January 19, 2021
- విద్యాసంస్థల ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తిచేయాలి - January 19, 2021
- వృద్ధురాలికి రక్తదానం - January 19, 2021