Breaking News

తపస్‌ ధర్నా

కామారెడ్డి, జనవరి 11

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ధర్నానుద్దేశించి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా దక్కాల్సిన పిఆర్‌సి, ఐఆర్‌ వంటివి కూడా అందని ద్రాక్షలా అయ్యాయని ముఖ్యమంత్రి ప్రతి సారి ప్రకటనలకు పరిమితం అయ్యారు తప్ప ఉద్యోగులకు ఎలాంటి న్యాయం చేయలేదని అన్నారు. ఉద్యోగుల మోచేతికి బెల్లం పెట్టి నాకమని అన్నట్లు ప్రభుత్వ తీరు ఉందని రమణారెడ్డి అన్నారు.

కొత్త సంవత్సరం కానుక అని ఉద్యోగులతో సమావేశమై ప్రకటించిన వాటిలో కూడా సాంకేతిక సమస్యల కారణం చూపి ఉద్యోగులకు అందకుండా చేశారని అన్నారు. పదోన్నతులు లేక చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు.

Check Also

మొదటి విడతలో 12 వేల మందికి వ్యాక్సిన్‌

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో ఏర్పాట్లపై జిల్లా ...

Comment on the article