నిజామాబాద్, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఫిబ్రవరి ఒకటి నుండి పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభించనున్నందున అధికారులు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా విద్యాశాఖ, ఇంటర్మీడియట్, సంక్షేమ శాఖల అధికారులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో చాలా రోజుల నుండి విద్యాసంస్థలు మూసి ఉంచినందున తిరిగి ప్రారంభానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల స్థాయిలో 9, 10 తరగతులను, కళాశాలలను ఫిబ్రవరి ఒకటి నుండి ప్రారంభిస్తున్నందున అన్ని విద్యాసంస్థల్లో, వసతి గహాల్లో, కళాశాలల్లో విద్యుత్ సరఫరా, త్రాగునీరు, శానిటేషన్, మరుగుదొడ్లు, ఫర్నిచర్ ఇతర అన్ని కూడా శుభ్రం చేయించాలని శానిటైజ్ చేయించాలని ఆదేశించారు.
పరిసరాలు శుభ్రం చేయించాలన్నారు. సంబంధిత అధికారులందరూ పాఠశాలల, కళాశాలల పునః ప్రారంభంపై చేస్తున్న ఏర్పాట్లపై పరిశుభ్రతపై క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని, ఇబ్బందులు ఉంటే తన దష్టికి తేవాలని ఆదేశించారు. ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. సమీక్షలో సంబంధిత అధికారులు హాజరయ్యారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021