Breaking News

పదోన్నతులు, కారుణ్య నియామకాలు త్వరగా పూర్తి చేయాలి

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉద్యోగులకు ప్రమోషన్స్‌, కంపాసినేట్‌ అపాయింట్మెంట్స్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో ఉద్యోగుల పదోన్నతులు, కంపాసినేట్‌ అపాయింట్మెంట్‌పై జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా ప్రాముఖ్యతతో ఉన్నదని తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రతి శాఖలో పదోన్నతులకు అర్హతలు ఉండి ఖాళీలు ఉంటే వెంటనే జనవరి 20 వరకు ఇవ్వాలని ప్రతి ప్రమోషన్‌ కూడా రోస్టర్‌ ప్రకారం చూసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కంపాసినేట్‌ అపాయింట్మెంట్‌లు అన్ని జనవరి 20 వరకు పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌కు ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌లు లత, చంద్రశేఖర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article