నిజామాబాద్, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతలో నిక్షిప్తమైన అపార శక్తిని వెలికి తీయడంలో, యువతను ప్రేరేపించడంలో యువతను సద్మార్గంలో నడిపించడంలో వివేకానంద స్వామి బోధనలకు మించి మరొకటి ఈ భూమండలంపైన లేదని తెలంగాణ జాగతి రాష్ట్ర నాయకులు నరాల సుధాకర్ అన్నారు. స్వామి వివేకానంద 159వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరం గాజుల పేటలో గల వివేకానంద విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నరాల సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచమంతా మనదేశం వైపు చూసేలా చేసిన మహోన్నత వ్యక్తి వివేకానందుడు అని, లే మేల్కొని సాధించు అంటూ యువతరానికి మార్గనిర్దేశం చేసిన మహనీయుడు వివేకానంద అన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచమంతా వెదజల్లిన గొప్ప హాలికుడు భారత ముద్దుబిడ్డ స్వామి వివేకానంద అని అన్నారు. కార్యక్రమంలో జాగృతి సభ్యులు అపర్ణ, రాజేష్, హరీష్, శంకర్, సందీప్, గోపాల్, వసంత, సరిత, రేఖ తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021