కామారెడ్డి, జనవరి 12
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించుటకు చేపట్టనున్న వ్యవస్థాపరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఉదయం టెలీ కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. మొదటి దశలో ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లో పనిచేస్తున్న హెల్త్ కేర్ వర్కర్లందరికి కోవిడ్ -19 వాక్సినేషన్ ఇవ్వాల్సిన ప్రాధాన్యతపై కలెక్టర్లను సెన్సిటైజ్ చేశారు.
వాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాలలో నిర్దేశించిన ఆపరేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా ఎక్కడైనా ప్రతికూల ప్రభావం కనపడితే వెంటనే తగు చర్యలు చేపట్టుటకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.
నెట్వర్క్ ద్వారా ముందుగా నిర్ణయించిన లబ్దిదారులను జిల్లా యంత్రాంగంచే వాక్సినేషన్ కేంద్రాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021