Breaking News

16న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు టీకా

నిజామాబాద్‌, జనవరి 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు కోవిడ్‌ టీకా ఇవ్వనున్నందున అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌పై డిఎం అండ్‌ హెచ్‌ఓ, హెల్త్‌ డిపార్ట్మెంట్‌తో సమీక్ష చేశారు. కలెక్టరేట్‌లో ఈ నెల 15న కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని డాక్టర్‌లను, సిబంద్ది నియమించాలని డిఎం అండ్‌ హెచ్‌ఓకు ఆదేశించారు.

జనవరి 16న కోవిడ్‌ వ్యాక్సిన్‌ నిజామాబాద్‌లో 6 సెంటర్లలో నిజామాబాద్‌ ప్రభుత్వ హాస్పిటల్‌, బోధన్‌ ఏరియా హాస్పిటల్‌, హోప్‌, మనోరమ, మెడికవర్‌, ప్రతిభలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్నామని దానికి కావల్సిన ఏర్పాట్లు అన్ని బాగుగా ఉండాలని, వ్యాక్సిన్‌ స్టోరేజ్‌ ఒక్కో సెంటర్‌లో ఎంత వరకు స్టోరేజ్‌ చేసుకోవచ్చో, వ్యాక్సిన్‌ ట్రాన్స్‌పోర్టులో ఇబ్బందులు కలుగకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

మొదటి ఫేస్‌లో తీసుకొనే వారి పేర్లు అప్‌ లోడ్‌ చేయాలని, ఒకవేళ ఇబ్బందులు వస్తే ఒక రిజిస్టర్‌ ఓపెన్‌ చేసి దానిలో పేర్లు నమోదుచేయాలని జనవరి 16న ఒక్కో సెంటర్‌లో 30 మందికి వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్నామని వారు అందుబాటులో వుండేవిధంగా చూసుకోవాలన్నారు. 6 సెంటర్‌లకు అధికారులను నియమించామని తెలిపారు. వారు అన్ని పరిశీలించాలని, అదేవిధంగా ప్రతి సెంటర్‌కు ఒక సీనియర్‌ డాక్టర్‌ను కూడా ఏర్పాటు చేయాలని, ప్రతి సెంటర్‌లో 10 బెడ్స్‌ ఒక ఎమర్జెన్సీ రూమ్‌, ఒక అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఆన్‌లైన్‌లో అంగన్వాడీ సిబ్బంది పేర్లు అన్ని మంగళవారం పూర్తి చేసిన తరువాత వెళ్లాలని పిడిని ఆదేశించారు. అదేవిధంగా ఎవ్వరు కూడా హెడ్‌ క్వాటర్‌ దాటి పోవద్దని డిఎం అండ్‌ హెచ్‌ఓకు ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ లత, చంద్రశేఖర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

యువజనోత్సవ పోటీలు

నిజామాబాద్‌, జనవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ...

Comment on the article