కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గం నసురుల్లాబాదు మండలానికి చెందిన సావిత్రి 42 సంవత్సరాల మహిళకు ఆపరేషన్ నిమిత్తము అమ్రిత వైద్యశాల బాన్సువాడలో ఏబి పాజిటివ్ రక్తం అవసరమైంది. వారికి కావలసిన రక్తం బాన్సువాడలో దొరకక పోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా 2 యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లప్పుడూ రక్తం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని, గతంలో కూడ హైదరాబాద్, బాన్సువాడ, సిరిసిల్ల, ...
Read More »Daily Archives: January 13, 2021
400 కోళ్ళు మృతి
డిచ్పల్లి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి తాండా లోని దుర్గాభవాని బ్రాయిలర్ పౌల్ట్రీ ఫాంలో 12, 13వ తేదీల్లో 400 కోళ్ళు అకస్మాత్తుగా మృతి చెందినట్టు పౌల్ట్రీ యజమాని రాంచందర్ తెలిపారు. కాగా జిల్లా పశు వైద్య, పశు సంవర్ధకశాఖ అధికారి డాక్టర్ భరత్, జిల్లా వ్యాధి నిర్దారణ కేంద్రం, సహాయ సంచాలకులు డాక్టర్ కిరణ్ దేశ్ పాండు, స్థానిక పశు వైద్యాధికారి డాక్టర్ గోపికృష్ణ తన సిబ్బందితో కలిసి పౌల్ట్రీని సందర్శించారు. ...
Read More »చెడును భోగి మంటల్లో కాల్చివేయాలి
కామారెడ్డి, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెడును భోగి మంటల్లో కాల్చి వేసి మంచి మార్గంలో నడవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ డా.శరత్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల రాశి వనం సమీపంలో తెలంగాణ జాగతి ఆధ్వర్యంలో జాగతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆదేశాల మేరకు నిర్వహించిన భోగి మంటలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన భోగికి పూజలు నిర్వహించి అగ్ని వెలిగించారు. భోగి మంటలలో ప్రతి ఒక్కరు చెడును, స్వార్థాన్ని ...
Read More »వ్యాక్సిన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి
నిజామాబాద్, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు అందించే కోవిడ్ వ్యాక్సిన్ కొరకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా 16వ తేదీన ఇచ్చే వ్యాక్సిన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు ముందు జాగ్రత్తలు తెలిపారు. 16న ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్, బోధన్ ...
Read More »వర్నిలో పోలీసు కళాజాత
వర్ని, జనవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు 12వ తేదీ మంగళవారం రాత్రి వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో శంకొరా గ్రామంలో పోలీస్ కళా జాత కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. డయల్ 100 సద్వినియోగం చేసుకోవాలని, ద్విచక్ర వాహన దారులు తప్పని సరి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని వివరించారు. అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరు ఆత్మహత్యలు చేసుకోరాదని, ప్రతి ...
Read More »