నిజామాబాద్, జనవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు అందించే కోవిడ్ వ్యాక్సిన్ కొరకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎక్కడ కూడా పొరపాట్లకు అవకాశం లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా 16వ తేదీన ఇచ్చే వ్యాక్సిన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు పలు సూచనలు ముందు జాగ్రత్తలు తెలిపారు.
16న ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్, బోధన్ ఏరియా ఆస్పత్రితో పాటు మరో నాలుగు ప్రైవేట్ ఆసుపత్రులు నిజామాబాద్‌లో ఎంపిక చేయగా ప్రైవేటు ఆసుపత్రులకు బదులు డిచ్పల్లి, ఆర్మూర్, మోర్తాడ్, మాక్లూర్ ఆరోగ్య కేంద్రాలలో కార్యక్రమాన్ని నిర్వహించాలని మొత్తం ఆరు కేంద్రాలలో కలిపి 180 మందికి వ్యాక్సిన్ అందించడానికి జాబితాను బుధవారమే సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు.
ఆరు కేంద్రాలలో అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. మంత్రి మంగళవారం సమావేశం సందర్భంగా తెలిపినట్లుగా ప్రతి సెంటర్లో మూడు ఏర్పాటు చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. సెల్ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఎంఅండ్ హెచ్‌వో సుదర్శనం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021