వర్ని, జనవరి 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాల మేరకు 12వ తేదీ మంగళవారం రాత్రి వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలో శంకొరా గ్రామంలో పోలీస్ కళా జాత కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్థులకు పలు విషయాలపై అవగాహన కల్పించారు. డయల్ 100 సద్వినియోగం చేసుకోవాలని, ద్విచక్ర వాహన దారులు తప్పని సరి హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని వివరించారు.
అలాగే ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరు ఆత్మహత్యలు చేసుకోరాదని, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉంటుందని ఆత్మ హత్య చేసుకుంటే వారి కుటుంబం ఒంటరి అవుతుందని గుర్తించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ ధూమపానానికి దూరంగా ఉండాలని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని సూచించారు.
మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని బ్యాంక్ / ఏటీఎం గురించి సమాచారం ఇవ్వద్దని, మహిళలు చైన్ స్నాచింగ్‌ల నుండి జాగ్రత్తలు పాటించాలని, ఒంటరిగా వెళ్ళ కూడదని చెప్పారు. మహిళల కోసం షి టీమ్ ఉపయోగించే విధానము, గ్రామంలో గల సమస్యల గురించి క్షుణ్ణంగ నాటక రూపంలో వివరించారు. కార్యక్రమంలో వర్ని ఎస్ఐ, గ్రామ సర్పంచ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- భూ సమస్యల పరిష్కారానికి మరిన్ని ఆదేశాలు - January 16, 2021
- డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల - January 16, 2021
- 31 లోగా పూర్తిచేయాలి - January 16, 2021