Breaking News

వ్యాక్సినేషన్‌ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 15

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 16న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభానికి ఏర్పాటు చేస్తున్నందున నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి శుక్రవారం పర్యటించి పరిశీలించారు. గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్న 302 వాయిల్స్‌ను భద్రపరిచిన ప్రభుత్వ వైద్య కళాశాలలో పర్యటించారు.

అనంతరం నిజామాబాద్‌ ప్రభుత్వం ఆసుపత్రిలో శనివారం ఏర్పాటు చేసే వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం సందర్భంగా నిర్వహించే కార్యక్రమం సదుపాయాలను పరిశీలించారు. కలెక్టరేట్లో కోవిడ్‌ ఫిర్యాదుల కోసం ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా వైద్య కళాశాలలో పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఈనెల 16న ఆరు కేంద్రాలలో వ్యాక్సినేషన్‌ ప్రారంభించనున్నామని ప్రతి కేంద్రంలో మొదటిరోజు 30 మంది చొప్పున వ్యాక్సిన్‌ వేయనున్నామని 18వ తేదీ నుండి 42 ప్రభుత్వ ఆసుపత్రులు 4 ప్రైవేటు ఆస్పత్రులలో వ్యాక్సిన్‌ వేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ముందుగా జిల్లాలలో గల సుమారు 15 వేల మంది ఆరోగ్య కార్యకర్తలకు సిబ్బందికి వ్యాక్సిన్‌ అందిస్తున్నామని వ్యాక్సినేషన్‌కు అవసరమైన శిక్షణ ఇతర కార్యక్రమాలు పూర్తిచేశామని వివరించారు.

కంట్రోల్‌ రూమ్లు ఏర్పాటు, ప్రారంభం

నిజామాబాద్‌ 8309219718

బోధన్‌ 08467 222001

ఆర్మూర్‌ 08463 295050

వ్యాక్సినేషన్‌కు సంబంధించి ప్రజలు పై నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమాల్లో కలెక్టర్‌ వెంట వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ ఇందిరా, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమ రాజ్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article