నిజామాబాద్, జనవరి 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా యువజన సంఘాల సమితి ప్రతి యేటా ఇచ్చే ప్రతిష్టాత్మకమైన జీవిత సాఫల్య పురస్కారానికి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ జానపద కళాకారుడు ఆష్ట గంగాధర్ ఎంపికయ్యారు. జగిత్యాల జిల్లా యువజన సంఘాల సమితి అద్యక్ష కార్యదర్శులు బొడ్డు రాజేష్, అతిక్ ఈ మేరకు గంగాధర్‌కు లేఖ పంపారు. కళారంగంలో చేస్తున్న సేవలకు గాను గంగాధర్‌ను జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు వారు లేఖలో పేర్కొన్నారు.
స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా యువజన సంఘాల సమితి ఆద్వర్యంలో జీవిత సాఫల్య పురస్కారాలతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి పురస్కారాలు అందజేస్తామని వివరించారు. పురస్కారాలు ఈ నెల 16న కోరుట్ల పట్టణంలో అందజేస్తామని, ముఖ్య అతిధిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్యతిదిగా హాజరవుతారన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021