నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ఆదేశాల ప్రకారం భూ సమస్యలు మరింత సులభంగా పరిష్కరించడానికి వీలవుతుందని క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్సు ద్వారా అదనపు కలెక్టర్, ఆర్డివోలు, తహసిల్దార్లతో ప్రభుత్వ ఆదేశాలపై తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు, కంపెనీల భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై సాప్ట్వేర్ ...
Read More »Daily Archives: January 16, 2021
డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్ష ఫలితాలు విడుదల
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలకు చెందిన డిగ్రీ ఇయర్ వైస్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. పరీక్షలకు మొత్తం 2680 విద్యార్థులు హాజరు కాగా 945 మంది ఉత్తీర్ణత సాధించారు. 35.26 ఉత్తీర్ణత శాతం నమోదు అయ్యిందని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించ వలసిందిగా అధికారులు పేర్కొన్నారు.
Read More »31 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మిషన్ భగీరథ పైపులైను పనులను ఈనెల 31లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో శనివారం మిషన్ భగీరథ పథకం పనులపై మండలాల వారీగా అధికారులతో సమీక్ష చేశారు. అధికారులు ఎలాంటి పెండింగ్ లేకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని, తాగునీటి వసతికి అన్ని చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ లక్ష్మీనారాయణ, డీఈలు, ...
Read More »ప్రజారోగ్యమే ప్రభుత్వాల లక్ష్యం
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వాల లక్ష్యమని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం పట్ల కషి చేసిన జిల్లా కలెక్టర్ కు, జిల్లా యంత్రాంగానికి, అభినందనలు తెలిపారు. ...
Read More »బలహీన వర్గాలకు అండగా ప్రభుత్వం
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బలహీన వర్గాల అభివద్ధి లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని, బడుగుల జీవితాల్లో వెలుగు నింపేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో స్థానిక శాసన సభ్యులు, ప్రభుత్వ విఫ్, గంప గోవర్ధన్ నివాసంలో పెరికకుల ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పెరికకుల సంఘం) 2021 వార్షిక క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ బిసిలకు, ఎంబిసిలకు ...
Read More »అందరికీ కృతజ్ఞతలు
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం 6 కేంద్రాలలో ప్రారంభించుకున్న వ్యాక్సినేషన్ పూర్తిగా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వేయించుకున్న వారికి రియాక్షన్ లేకుండా విజయవంతం చేసుకున్నామని ఇందుకు కషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 18వ తేదీన మరో 20 ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నామని కలెక్టర్ తెలిపారు. శనివారం లాగే సోమవారం ఆ తదుపరి కూడా నిర్వహించే కార్యక్రమాలు కూడా ఇదే విధమైన ప్రణాళికతో ముందుకు ...
Read More »సమాచార హక్కుచట్టం క్యాలండర్ ఆవిష్కరణ
గాంధారి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార హక్కుచట్టం క్యాలండర్‌ను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ శనివారం ఆవిష్కరించారు. 2021 కు సంబందించిన మొత్తం 12 నెలల క్యాలండర్ ఎంతో బాగుందని ఎమ్మెల్యే అన్నారు. సమాచార హక్కుచట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ రాధా బలరాం, జడ్పీటీసీ శంకర్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, సమాచార హక్కుచట్టం జిల్లా కార్యదర్శి రమేష్, సంజీవులు, మండల ప్రతినిధులు సురేష్, కష్ణ, సాయిలు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Read More »నర్సరీలలో మొక్కలు సంరక్షించాలి
గాంధారి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నర్సరీలలో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని కామారెడ్డి ఏపిడి, ఇంచార్జ్ డిపిఓ సాయన్న అన్నారు. శనివారం గాంధారి మండలకేంద్రంలో నర్సరీని అయన పరిశీలించారు. ఈ సందర్బంగా సీడ్ దిబ్లింగ్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించగా దానిని తిలకించారు. మొక్కలు పెంచే క్రమంలో వాటి విత్తనాలు నాణ్యతగా ఉండేలా చూడాలన్నారు. మొక్కలకు ఎప్పటికప్పుడు నీటిని అందించాలని సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధులు నర్సరీల బాధ్యతలు స్వీకరించి వాటిని కాపాడే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శంకర్ నాయక్, ఎంపీపీ ...
Read More »అటవీఅధికారుల నుండి భూములకు రక్షణ కల్పించాలి
గాంధారి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిరుపేదలైన తమకు అన్ని హక్కులు కల్పించి ఇచ్చిన వ్యవసాయ భూములకు అటవీ అధికారుల నుండి కాపాడి రక్షణ కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. గాంధారి మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామశివారులో గత 40 సంవత్సరాలనుండి సర్వే నెంబర్ 118 లో నిరుపేద రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వం సర్వ హక్కులు కల్పించి నూతన పట్టా పాసుపుస్తకాలు కూడా జారీచేసింది. ఇట్టి భూమికి పట్టతో సహా అన్ని హక్కులు కల్పించింది. ఇట్టి భూమిని ...
Read More »శోభాయమానంగా శోభాయాత్ర….
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామాజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం శ్రీరామ నామ సంకీర్తన శోభయాత్ర కామారెడ్డి సరస్వతి శిశుమందిర్ నుండి ప్రారంభమై పట్టణంలోని పుర వీధుల గుండా నిర్వహించారు. శోభాయాత్ర ప్రారంభానికి ముందు శిశుమందిర్ లో జరిగిన సభలో ముఖ్య అధితిగా విచ్చేసిన సోమయప్ప స్వామిజి మాట్లాడుతూ తరతరాల నుండి కలలు కన్న భవ్య రామ మందిర నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి హిందూ బంధువు దగ్గరకి రామ భక్తులు వెళ్లి నిధి సేకరించడం ...
Read More »రక్తదానం చేసిన యువకుడు
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డికి చెందిన అంజయ్యకు హైదరాబాదులోని యశోదా వైద్యశాలలో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బిబీపేట్ గ్రామానికి చెందిన ఉప్పు కష్ణ సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడానికి కామారెడ్డి రక్తదాతల సమూహం ఎల్లప్పుడూ ముందు ఉంటుందని రక్తదానానికి ముందుకు వచ్చిన కష్ణను అభినందించారు. ఈ కార్యక్రమంలో సురేష్ పాల్గొనడం జరిగింది.
Read More »కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సదాశివనగర్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం సదాశివనగర్ మండల కేంద్రంలో మండలానికి చెందిన 95 మంది లబ్దిదారులకు 95 లక్షల 11 వేల 020 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులు, అదేవిధంగా తన సొంత ఖర్చులతో ఆడపడుచులకు కిట్టు (పట్టు చీరలను) స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, జహీరాబాద్ ఎం.పీ బి.బి పాటిల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల జడ్పీటీసీ నర్సింలు, ఎంపీపీ అనసూయ రమేష్, స్థానిక ఎంపీటీసీలు శ్రీనివాస్ (వైస్ ఎంపీపీ), బీరయ్య, సర్పంచ్ శ్రీనివాస్ ...
Read More »భక్తులతో కిట కిటలాడిన లింబాద్రి గుట్ట
భీమ్‌గల్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణంలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన శ్రీ నింబాచల క్షేత్రం శనివారం ఉదయం 6 గంటల నుండి దర్శనాల రద్దీ ప్రారంభం అయింది. కరోన తర్వాత రోజు రోజు భక్తుల తాకిడి పెరుగుతూ ఉంది. శనివారం ఉదయం నుండి స్వామి వారి దర్శనం కోసం భక్తులు బారికేడ్ల మధ్య కూర్చొని వేచి చూసారు. 6 గంటల తరవాత గుడి తెరుచుకోగానే భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం భక్తులకు దేవస్తానం వారు ఏర్పాటు ...
Read More »కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వ్యాక్సిన్ ప్రక్రియ విజయవంతం
నిజామాబాద్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది నెలలుగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా చేసిన కషి ఫలితమే వ్యాక్సిన్ ప్రజలకు అందించడానికి వీలు అయిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేయడంతో పాటు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయడానికి యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నదని రాష్ట్ర రోడ్లు- భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా శనివారం కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంత్రి ముఖ్యఅతిథిగా వ్యాక్సినేషన్ ...
Read More »