Breaking News

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సదాశివనగర్‌, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సదాశివనగర్‌ మండల కేంద్రంలో మండలానికి చెందిన 95 మంది లబ్దిదారులకు 95 లక్షల 11 వేల 020 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులు, అదేవిధంగా తన సొంత ఖర్చులతో ఆడపడుచులకు కిట్టు (పట్టు చీరలను) స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, జహీరాబాద్‌ ఎం.పీ బి.బి పాటిల్‌ పంపిణీ చేశారు.

కార్యక్రమంలో మండల జడ్పీటీసీ నర్సింలు, ఎంపీపీ అనసూయ రమేష్‌, స్థానిక ఎంపీటీసీలు శ్రీనివాస్‌ (వైస్‌ ఎంపీపీ), బీరయ్య, సర్పంచ్‌ శ్రీనివాస్‌ రెడ్డి, జడ్పీ కో ఆప్షన్‌ మొయినుద్దీన్‌, మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్‌ రావు, మండల తెరాస అధ్యక్షుడు భాస్కర్‌, సొసైటీ చైర్మన్లు కమలాకర్‌, గంగాదర్‌, భూమిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment on the article