Breaking News

అటవీఅధికారుల నుండి భూములకు రక్షణ కల్పించాలి

గాంధారి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం నిరుపేదలైన తమకు అన్ని హక్కులు కల్పించి ఇచ్చిన వ్యవసాయ భూములకు అటవీ అధికారుల నుండి కాపాడి రక్షణ కల్పించాలని రైతులు వేడుకుంటున్నారు. గాంధారి మండలంలోని బ్రాహ్మణ పల్లి గ్రామశివారులో గత 40 సంవత్సరాలనుండి సర్వే నెంబర్‌ 118 లో నిరుపేద రైతులు వ్యవసాయం సాగిస్తున్నారు. వీరికి ప్రభుత్వం సర్వ హక్కులు కల్పించి నూతన పట్టా పాసుపుస్తకాలు కూడా జారీచేసింది.

ఇట్టి భూమికి పట్టతో సహా అన్ని హక్కులు కల్పించింది. ఇట్టి భూమిని సాగుకు అనుకూలంగా మలుచుకున్న రైతులు అందులో బోరు బావులు వేసి, డ్రిప్‌ పైప్‌లైన్‌ వేసుకొని పంటలు పండిస్తున్నారు. అకస్మాత్తుగా అటవీ అధికారులు వచ్చి ఈ భూమి రిజర్వు ఫారెస్ట్‌ అని అందులో కందకాలు తవ్వడం ప్రారంభించారు. ఇది అటవీ భూమి అని వెంటనే ఖాళీ చేసి వెళ్లాలని బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు రెవెన్యూ పాసుపుస్తకాలు ఉన్నాయని అటవీ అధికారుల దౌర్జన్యం నుండి తమ భూములను కాపాడి రక్షణ కల్పించాలని గాంధారి తహసీల్దార్‌ నాగరాజు గౌడ్‌కు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా తహసీల్దార్‌ వెంటనే మండల అటవీ అధికారులతో మాట్లాడి వారం రోజులలో ఉమ్మడి సర్వే జరిపిస్తామని, అప్పడి వరకు కందకాలు తవ్వడం నిలిపివేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Check Also

సమన్వయంతో పనిచేస్తేనే అభివద్ధి సాధ్యం

గాంధారి, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల అభివద్ధి ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతోనే సాధ్యమౌతుందని ఎల్లారెడ్డి ...

Comment on the article