నిజామాబాద్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ ఆదేశాల ప్రకారం భూ సమస్యలు మరింత సులభంగా పరిష్కరించడానికి వీలవుతుందని క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఈ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. శనివారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్సు ద్వారా అదనపు కలెక్టర్, ఆర్డివోలు, తహసిల్దార్లతో ప్రభుత్వ ఆదేశాలపై తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ఆర్ఐలు, కంపెనీల భూముల పట్టాదారు పాసు పుస్తకాలపై సాప్ట్వేర్ సిద్ధం చేయడం జరిగిందని వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమస్యలు పరిష్కరించడానికి తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలన్నారు. రెవెన్యూ కోర్టు కేసులకు సంబంధించి వచ్చే వారం నుండి రెవెన్యూ ట్రిబ్యునల్ ద్వారా నెలలోపు ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని, కేసులకు సంబంధించిన వ్యక్తులు వారికి జారీ చేసిన తేదీన రెవెన్యూ కోర్టుకు వచ్చి వారి వివరాలు సమర్పించాలని ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
మిస్సింగ్ సర్వే నంబర్ కేసులు కూడా దరఖాస్తుదారులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారిచ్చిన ఆధారాల ప్రకారం పరిశీలించడం జరుగుతుందని అదేవిధంగా పాసుబుక్కులు రాని వారు కూడా అన్ని ఆధారాలతో మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి న్యాయబద్ధంగా ఉంటే అప్రూవల్ చేయడం జరుగుతుందని తెలిపారు. అప్డేషన్ కొరకు ఫారం 22 ఏ లోని ప్రొఫార్మా 1, 2, 3 తహసిల్దార్లు వివరాలు పంపించాలని మూడవ ప్రొఫార్మాలో వివరాలను కలెక్టరేట్లో పరిశీలించి తగు చర్యలు కొరకు నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
అదేవిధంగా సాదాబైనామా కొరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని అందుకు సంబంధించిన అన్ని నిబంధనలు పరిశీలించి అసలైన లబ్ధిదారులకు పరిష్కారం చేయడం జరుగుతుందని ఈ విషయంలో రైతులు కార్యాలయాలకు రావలసిన అవసరం లేదని ఈ విషయాలు రెవెన్యూ అధికారులు రైతులకు క్లియర్గా తెలియజేయాలని తెలిపారు. ధరణి పనిచేయని కాలంలో మ్యుటేషన్ చేసిన రికార్డులను నమోదు చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వచ్చే మూడు నెలలపాటు రెవెన్యూ అధికారులు అదనపు శ్రద్ధ కనబర్చి భూముల రికార్డులు ఎర్రర్ ఫ్రీ రికార్డ్స్ జిల్లాగా తీర్చిదిద్దడానికి పూర్తిస్థాయిలో పరిష్కారం జరిగే విధంగా కషి చేయవలసి ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. సెల్ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డివోలు రవి, శ్రీనివాస్, రాజేశ్వర్, ఆయా మండలాల తహసీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్సు – పలు అంశాలపై సమీక్ష - March 2, 2021
- టీయూ ఐక్యూఎసీ డైరెక్టర్గా ఆచార్య కౌసర్ మహ్మద్ - March 2, 2021
- ‘‘డైరెక్ట్ టాక్సెస్’’ పుస్తకావిష్కరణ - March 2, 2021