Breaking News

ప్రజారోగ్యమే ప్రభుత్వాల లక్ష్యం

కామారెడ్డి, జనవరి 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రభుత్వాల లక్ష్యమని ప్రభుత్వ విప్‌, కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం మొదటి విడత కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా కట్టడిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలవడం పట్ల కషి చేసిన జిల్లా కలెక్టర్‌ కు, జిల్లా యంత్రాంగానికి, అభినందనలు తెలిపారు.

మొదటి విడతలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసిన ఆరోగ్య, ఆశ, అంగన్‌వాడి కార్యకర్తలకు టీకాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్‌పై ఎవరైనా చెడు ప్రచారం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. జెడ్పి చైర్‌ పర్సన్‌ శోభ మాట్లాడుతూ కరోనా వ్యాధికి వ్యాక్సిన్‌ రావడం శుభ పరిణామమని చెప్పారు. పది నెలల పాటు కరోనా వైరస్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని పేర్కొన్నారు.

కరోనా నిర్మూలనకు వైద్య సిబ్బంది, ఐసిడిఎస్‌, పోలీసులు, రెవెన్యూ శాఖ, జిల్లా యంత్రాంగం చేసిన కషిని కొనియాడారు. జిల్లా యంత్రాంగం, వైద్య సిబ్బంది, పోలీస్‌, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేశాయని పేర్కొన్నారు. కరోనా సమయంలో వైద్య సిబ్బంది ఇంటికి వెళ్లకుండా వైద్య సేవలు అందించడం హర్షణీయమన్నారు. జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ మాట్లాడారు.

ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అందరి భాగస్వామ్యంతో జిల్లాలో 22 శాతం ఉన్న పాజిటివ్‌ను 0.32 శాతానికి తగ్గించడం జరిగిందని, ముందు ముందు కూడా కరోనా నియంత్రణకు నిరంతరం కషి చేస్తామని తెలిపారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు బీబీ పాటిల్‌ మాట్లాడుతూ, కరోనా వ్యాక్సిన్‌ సురక్షితమైనదని చెప్పారు. పది నెలలుగా కరోనా వైరస్‌ ప్రజలకు పెను సవాలుగా మారిందన్నారు.

వ్యాక్సిన్‌ వేసుకోవడానికి వైద్య సిబ్బంది, అంగన్‌వాడి కార్యకర్తలు ధైర్యంతో ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌ కుమార్‌కు మొదటి టీకా వేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, ఆర్‌డీఓ శ్రీను, డాక్టర్‌ శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article