నిజామాబాద్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం 6 కేంద్రాలలో ప్రారంభించుకున్న వ్యాక్సినేషన్ పూర్తిగా ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వేయించుకున్న వారికి రియాక్షన్ లేకుండా విజయవంతం చేసుకున్నామని ఇందుకు కషిచేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతున్నానని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. అదేవిధంగా 18వ తేదీన మరో 20 ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించనున్నామని కలెక్టర్ తెలిపారు.
శనివారం లాగే సోమవారం ఆ తదుపరి కూడా నిర్వహించే కార్యక్రమాలు కూడా ఇదే విధమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులకు సూచించారు. శనివారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్‌వోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఆర్డివోలతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం మరో 20 కేంద్రాలలో అనగా నిజామాబాద్ డివిజన్లో ఇందల్వాయి, ధర్పల్లి, నవీపేట్, మాలపల్లి, అర్సపల్లి లోను, బోధన్ డివిజన్లో రాకాసి పేట్, కోటగిరి, రెంజల్, రుద్రూర్, వర్ని, ఎడపల్లి పోతంగల్ ఆరోగ్య కేంద్రాలలోను, ఆర్మూర్ డివిజన్ లోని భీమ్‌గల్, డొంకేశ్వర్, బాల్కొండ, జక్రాన్పల్ల్లి, కమ్మర్పల్లి, నందిపేట్, వేల్పూర్, ఆర్మూర్ ఆరోగ్య కేంద్రాలలోను వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించబోతున్నామని ఇందుకుగాను ప్రతి కేంద్రంలో 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేసుకొని వారి ఆధార్ నెంబర్, సంతకాలు సేకరించుకొని జాబితాలు సిద్ధం చేసుకోవాలని శనివారం నిర్వహించుకున్న విధంగానే సోమవారం కూడా అన్ని ముందు జాగ్రత్తలతో కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా అన్ని విషయాలు కూడా వ్యక్తిగతంగా సంబంధిత మెడికల్ ఆఫీసర్లు పర్యవేక్షణ చేసుకోవాలని అన్నింటికీ వారు బాధ్యత నిర్వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వ్యాక్సినేషన్ కొత్త విషయం కానప్పటికీ కోవిడ్ విషయంలో కొంత జాగ్రత్తగా విధులు నిర్వహించవలసి ఉంటుందని తెలిపారు. సెల్ కాన్ఫరెన్సులో డిఎంఅండ్‌హెచ్‌వో సుదర్శనం, ఆర్డివోలు రవి, రాజేశ్వర్, శ్రీనివాస్, డిప్యూటీ డిఎం హెచ్‌వోలు, మెడికల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021