నిజామాబాద్, జనవరి 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది నెలలుగా శాస్త్రవేత్తలు నిర్విరామంగా చేసిన కషి ఫలితమే వ్యాక్సిన్ ప్రజలకు అందించడానికి వీలు అయిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి సమన్వయంతో పనిచేయడంతో పాటు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేయడానికి యంత్రాంగం అన్ని చర్యలు తీసుకున్నదని రాష్ట్ర రోడ్లు- భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
దేశవ్యాప్తంగా శనివారం కోవిడ్ వ్యాక్సిన్ ప్రారంభించుకున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంత్రి ముఖ్యఅతిథిగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా అజయ్ అనే సానిటరీ వర్కర్‌కు వ్యాక్సిన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అబ్జర్వేషన్ అనంతరం ఉద్యోగి మంచి ఆరోగ్యంగా ఉన్నాడని, ఎన్నో స్థాయిలలో నిర్వహించిన పరిశోధనల్లో వ్యాక్సిన్ నూరు శాతం సురక్షితమైనదని తేలిన తర్వాతనే ప్రజలకు అందించడానికి ముందుకు రావడం జరిగిందని, అందువల్ల ఎటువంటి అపోహలకు తావివ్వవద్దని మంత్రి తెలిపారు.
కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆయన వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూములను పరిశీలించారు. వ్యాక్సిన్ వేయించుకున్న వారియర్స్‌తో ఆయన మాట్లాడి వారి ఫీలింగ్ గురించి అడగగా వారు పూర్తి సంతప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మాట్లాడుతూ పది నెలలుగా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు కషి చేసిన శాస్త్రవేత్తలకు అందరికి కూడా ప్రజల తరఫున, ప్రభుత్వం తరఫున, యంత్రాంగం తరఫున కతజ్ఞతలు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి లాంఛనంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారని 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్సుకు మొదటి విడతలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఒకే గొడుగు కింద జరగాలనే ఉద్దేశంతో సూచనలను స్వాగతిస్తూ అమలు చేస్తూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాష్ట్రమంతా, జిల్లా వ్యాప్తంగా పూర్తి చేయడానికి ప్రభుత్వం సర్వసన్నద్ధంగా అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
జిల్లాలో మొదటి విడతలో పార్ట్ – ఏ కింద వైద్య ఆరోగ్య శాఖ ప్రభుత్వ, ప్రైవేటు సిబ్బంది, ఐసిడిఎస్ కార్యకర్తలు మొత్తం 15 వేల మందికి, అదేవిధంగా పార్టు- బి లో 8000 పోలీస్, రెవెన్యూ సిబ్బందికి మొత్తం 23 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామన్నారు. ప్రారంభరోజైన శనివారం జిల్లాలోని 6 కేంద్రాల ద్వారా ప్రతి కేంద్రంలో 30 మంది చొప్పున వ్యాక్సిన్ వేస్తున్నామని, 18వ తేదీ నుండి జిల్లాలోని 42 పిహెచ్‌సిలు, సిహెచ్సీలు, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 4 ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయనున్నానని ప్రతిరోజు సంఖ్యను పెంచుకుంటూ ముందు ముందు ఒక్కో సెంటర్లో వంద మందికి వ్యాక్సిన్ వేసే విధంగా ఏర్పాటు చేయడానికి అధికారులను ఆదేశించామని తెలిపారు.
ఏర్పాట్లలో భాగంగా ప్రతి కేంద్రంలో వెయిటింగ్ రూమ్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ రూములు వేరువేరుగా సిద్ధం చేయాలని ఎమర్జెన్సీ మందులను కూడా అందుబాటులో ఉంచుకోవాలని, ప్రతి కేంద్రంలో వ్యాక్సిన్ వేయడానికి ఇద్దరేసి సిబ్బందిని నియమించాలని ఆంటీ రియాక్షన్ మందుల కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని, తెలిపామన్నారు. అంతేకాక ప్రతి కేంద్రంలో కనీసం 10 పడకలు అత్యవసరం కోసం ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందన్నారు.
ఎక్కడ కూడా ఏ చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా, అత్యవసరం కోసం ప్రతి కేంద్రంలో అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచుకోవడంతో పాటు జిల్లాస్థాయి, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాలని మొదటి డోసు తీసుకున్న 28 రోజులకు రెండవ డోసు కూడా తీసుకోవాలని ఆ తర్వాత 14 రోజులకు శరీరంలో యాంటీవైరస్ డెవలప్ అవుతుందని అప్పుడే ఆ వ్యక్తి కరోన రహిత వ్యక్తిగా రూపుదిద్దుకుంటుందని అంతవరకు మాత్రం కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించవలసి ఉంటుందని ఆయన ప్రజలకు సూచించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , నగర మేయర్ నీతూకిరణ్, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, శాసనసభ్యులు గణేష్ గుప్తా, శాసనమండలి సభ్యులు రాజేశ్వరరావు, ఆకుల లలిత, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డిఎం హెచ్ఓ సుదర్శనం, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమరాజ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఇందిర, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, అధికారులు ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021