నిజామాబాద్, జనవరి 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో కోటగల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ఇంచార్జి ఎం.సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 475 కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ప్రధానంగా శ్రమదోపిడికి గురవుతున్నారని, ఉదయం 5 గంటలనుండి రాత్రి 7 గంటల వరకు కేజీబీవీల్లో తీవ్రమైన ఒత్తిడితో పని చేస్తున్నారన్నారు. అవసరాల మేరకు సిబ్బంది లేకపోవడంతో అధిక పనిభారంతో అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పని భారం పెరిగినా వేతనాలు పెరగడం లేదని, పని ఒత్తిడితో నాన్ టీచింగ్ వర్కర్లు అనారోగ్యానికి గురవుతున్నారని అయినా సరైన సిబ్బంది లేకపోవడంతో విధులకు హాజరు కావాల్సి వస్తుందన్నారు.
కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా ఉంటుందన్నారు.
కేజీబీవీల్లో ఉన్న నాన్ టీచింగ్ వర్కర్లు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ప్రజాస్వామ్య వాదులు కేజీబీవీ సిబ్బంది చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపాలని కోరారు. సమావేశంలో ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు వెంకన్న, నాయకులు ఈశ్వరి, శారద, సావిత్రి, రమ, కష్ణవేణి, విజయ, శారద పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021