రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించడమే ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు సేఫ్టీ మాసోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రవాణా శాఖ ఏర్పాటుచేసిన బ్యానర్‌ లాంచ్‌ను కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. 18 జనవరి నుండి 17 ఫిబ్రవరి వరకు నెల రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా సేవ్‌ చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సడక్‌ సురక్ష – జీవన్‌ రక్ష అనే నినాదంతో ముందుకు వెళ్లాలని ఈ సంవత్సరం అవగాహన కల్పించడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

మానవ తప్పిదంతో 85 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. వాహనం నడిపే వారు జాగ్రత్తలు తప్పనిసరి తీసుకోవాలనారు. మద్యం తాగి, రాంగ్‌ రూట్‌లో నడపడం, ఓవర్‌ టేక్‌ చేయడం, హెల్మెట్‌ ధరించకపోవడం, సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం తదితర కారణాల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటరమణ రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ ఉమ్మడి జిల్లా, రాజు బోధన్‌, వెంకటస్వామి ఆర్మూర్‌ వెంకటయ్య నిజామాబాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేరాల‌ శాతం తగ్గించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం హైదరాబాద్‌ నుండి తెలంగాణ రాష్ట డి.జి.పి ఎమ్‌. ...

Comment on the article