Breaking News

పెండింగ్‌ మ్యుటేషన్‌ల ప్రతిపాదనలో జాగ్రత్తగా పంపండి

నిజామాబాద్‌, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్‌లను క్లియర్‌ చేయడానికి ప్రతిపాదించే వివరాలు జాగ్రత్తగా చూసి పంపాలని తహసీల్దార్లను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. సోమవారం సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా తాసిల్దార్‌లు ఆర్డీవోలతో పెండింగ్‌ మ్యుటేషన్‌ల క్లియరెన్స్‌పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 22 ఏ లో నిర్దేశించిన ఆదేశాల ప్రకారం వివరాలు సమర్పించాలని రికార్డులు సరి చూసుకోవాలని రైతులు సమర్పించిన వివరాలను కూడా పరిశీలించాలని తెలిపారు. న్యాయంగా ఉన్నా ప్రతిదానికి సిఫారసు చేయాలని పొరపాట్లు ఉంటే ఆ విషయాలను తెలుపుతూ వివరాలు సమర్పించాలని ఆదేశించారు.

మీ సేవా కేంద్రాలలో దరఖాస్తుదారుల నుండి అధిక ఫీజులు వసూలు చేయకుండా కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. సెల్‌ కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌డివోలు, తహసిల్దార్‌లు పాల్గొన్నారు.

Check Also

21 నుండి డిగ్రీ, పిజి తరగతులు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ 1వ, ...

Comment on the article