Breaking News

వ్యాక్సినేషన్‌ పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్సపల్లి పిహెచ్‌సిలో నిర్వహిస్తున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సోమవారం పరిశీలించారు. వెయిటింగ్‌ హాల్‌, వ్యాక్సినేషన్‌ రూమ్‌, అబ్జర్వేషన్‌ రూమ్స్‌, సదుపాయాలు పరిశీలించారు. ఏర్పాట్లపై సంతప్తి వ్యక్తం చేశారు. ఎవరికైనా సమస్య వస్తే ఏ విధంగా హ్యాండిల్‌ చేయాలో, వైద్య సిబ్బంది ఎంతవరకు తయారుగా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు.

అంబులెన్స్‌, వాటర్‌ సౌకర్యము, యాంటీ రియాక్షన్‌ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని మెడికల్‌ ఆఫీసర్‌ను ఆదేశించారు. అనంతరం వ్యాక్సిన్‌ తీసుకున్న వారితో కలెక్టర్‌ మాట్లాడారు సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా తలనొప్పి ఉందా అని తెలుసుకున్నారు. వ్యాక్సిన్‌ చేసుకున్న వారు ఎలాంటి ప్రాబ్లం లేవని కలెక్టర్‌ గారికి వివరించారు. కలెక్టర్‌ వెంబడి డిప్యూటీ డిఎం హెచ్‌వో డాక్టర్‌ అంజన, మెడికల్‌ ఆఫీసర్‌, ఆసిఫ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

రక్తదానం చేసిన బిజెపి నాయకుడు

కామారెడ్డి, మార్చ్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణానికి చెందిన లావణ్య అనే మహిళకు ఆపరేషన్‌ ...

Comment on the article