నిజామాబాద్, జనవరి 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని 14 కేంద్రాల ద్వారా 731 మందికి సోమవారం కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సంబంధిత అధికారులతో సెల్ కాన్ఫరెన్సు ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంపై మాట్లాడారు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ప్రారంభించిన 6 కేంద్రాలతోపాటు మరో ఎనిమిది కలిపి మొత్తం 14 కేంద్రాలలో సోమవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని 731 మందికి వ్యాక్సిన్ వేశారని ఎటువంటి రియాక్షన్లు లేవని ఆయన వివరించారు.
మంగళవారం మరో 15 కేంద్రాలలో ప్రారంభించి లక్ష్యానికి అనుగుణంగా ఎంపిక చేసిన వారికి వ్యాక్సిన్ వేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గర్భవతులు బాలింతలు మినహా ప్రతి హెల్త్ కేర్ వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ హెల్పర్ లు వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి ముందుకు రావాలని తద్వారా ప్రజలకు పాజిటివ్ మెసేజ్ వెళ్తుందని పేర్కొన్నారు. ప్రతి మూడు కేంద్రాలకు ఒక అంబులెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలని ప్రతి సెంటర్కు ఒక రిఫరల్ సెంటర్ ఉండాలని ఆ విధంగా అవసరమైతే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రతిరోజు 200 మందికి వ్యాక్సినేషన్ చేయాలని పేర్కొన్నారు. ఆర్డివోలు, మెడికల్ అధికారులు, ఎంపీడీవోలు బాధ్యత తీసుకొని ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి ప్రజలలో చైతన్యం కలిగించే విధంగా చూడాలని సూచించారు. సెల్ కాన్ఫరెన్సులో డిఎం అండ్ హెచ్వో సుదర్శనం, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్, మెడికల్ అధికారులు, డిప్యూటీ డిఎం హెచ్వోలు, ఆర్డివోలు తదితరులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- క్రొవ్వొత్తులతో న్యాయవాదుల నిరసన ప్రదర్శన - February 27, 2021
- సమీకృత మార్కెట్ కోసం స్థల పరిశీలన - February 27, 2021
- వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - February 27, 2021