నిజామాబాద్, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఫిబ్రవరి 1 నుండి తొమ్మిదవ తరగతి నుండి డిగ్రీ వరకు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అందుకు కావలసిన ఏర్పాట్లు జనవరి 27 వరకు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాలు నుండి విద్యాశాఖ ఎంఈఓలు, కళాశాల ప్రిన్సిపల్స్, ఎంపీడీవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 నెలల నుండి కళాశాలలు, పాఠశాలలు మూసి ఉండడం, ఫిబ్రవరి 1 నుండి ప్రారంభం కానున్నందున శానిటేషన్, పారిశుద్ధ్య కార్యక్రమాలు, త్రాగునీరు ఇతర మెటీరియల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించుటకు టీంలు ఏర్పాటు చేసుకోవాలని, బుధవారం నుండి పది రోజుల ప్రోగ్రాం ప్లాన్ చేసుకోవాలని ఆదేశించారు.
స్కూల్లల్లో, కళాశాలల్లో, హాస్టల్లో 20 జనవరి నుండి 22 వరకు క్లీనింగ్ అయిపోవాలన్నారు. క్లీనింగ్‌కు కావలసిన మెటీరియల్ కొనుగోలు చేయాలన్నారు. స్కూల్స్‌లో జిపి నుండి మున్సిపాలిటీలలో ఉన్న స్కూల్స్‌కు మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బందితో క్లీన్ చేయించాలన్నారు. ప్రతి ఇనిస్టిట్యూషన్ నాలుగు రోజులు వాటర్‌తో వాష్ చేయించాలన్నారు. జనవరి 24 వరకు క్లీన్ చేసి రెడీగా ఉంచాలన్నారు. జనవరి 27 నాటికి కావలసిన సామాగ్రి కొని ఉంచాలన్నారు.
అవేర్నెస్ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, గ్రామ పంచాయతీ సెక్రెటరీ సోడియం హైడ్రో ఫ్లోరైడ్‌తో స్ప్రే రెగ్యులర్‌గా చేయించాలన్నారు. అవగాహన కమిటీతో విద్యార్థుల లిస్టు ఉండాలన్నారు. జనవరి 27 తేదీ నాటికి అందరిని టచ్ చేయాలని తల్లిదండ్రులతో తెలిపారు. స్కూల్లో, హాస్టల్స్‌లో, కళాశాలలలో కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, నిర్లక్ష్యం చేయరాదన్నారు. విద్యార్థులకు చిన్న ప్రాబ్లం ఉన్నా వెంటనే తెలియజేయాలన్నారు.
టాయిలెట్స్ క్లీన్ చేయించాలన్నారు. కిచెన్ మెటీరియల్ గ్యాస్ 27 వరకు పూర్తిగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. మెడికల్ టీంలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఎక్కడ సమస్యలు ఉండకూడదన్నారు. హరిత హారంలో నాటిన మొక్కలను కాపాడాలన్నారు. టాయిలెట్స్, క్లాస్ రూమ్ డోర్స్ చిన్న చిన్న రిపేర్స్ చేయించాలన్నారు. అన్ని గ్రామ పంచాయతీల నుండి మున్సిపాలిటీలో ఉన్న వాటికి మున్సిపాలిటీ నుండి సపోర్టు తప్పక ఉంటుందని తెలిపారు.
పాత రైస్, పప్పులు, ఆయిల్ వాడకూడదన్నారు. డిఎం సివిల్ సప్లయి ద్వారా రైస్ కొత్త అలాట్మెంట్ ఇస్తామన్నారు. ఎక్కడన్న బోరు రిపేర్ ఉంటే చేయించుకోవాలన్నారు. జిపి ద్వారా ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారా మిషన్ భగీరథ వాటర్ కనెక్షన్ తీసుకోండని తెలిపారు. వీడియో కాన్ఫరెన్సులో అడిషనల్ కలెక్టర్ లత, డీఈఓ దుర్గాప్రసాద్, డిఐఓ ఒడ్డెన్న, జిజి కాలేజ్ ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021