Breaking News

వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డికి చెందిన సరస్వతి (56) సంవత్సరాల వద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై అత్యవసర పరిస్థితుల్లో 3 యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. బిబీపేట మండల కేంద్రానికి చెందిన సంతోష్‌ సహకారంతో ఓ పాజిటివ్‌ రక్తాన్ని వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు.

ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని ప్రస్తుత తరుణంలో రక్తం లభించక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని మానవతా దక్పథంతో రక్తదానానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు. కార్యక్రమంలో టెక్నీషియన్‌ చందన్‌ తదితరులున్నారు.

Check Also

పంట రుణాల ల‌క్ష్యాన్ని సాధించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పంట బుణాల ల‌క్ష్యాన్ని బ్యాంకర్ల సమన్వయంతో వ్యవసాయ ...

Comment on the article