Breaking News

కోవిడ్‌ టీకా కేంద్రాన్ని ప్రారంభించిన బోధన్‌ ఎమ్మెల్యే

బోధన్‌, జనవరి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బోధన్‌ మండలం సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ టీకా కేంద్రాన్ని బోధన్‌ శాసనసభ్యులు ఎండి.షకిల్‌ ఆమ్మేర్‌ ప్రారంభించారు. వివిధ గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎం సిబ్బంది, ఆరోగ్య కేంద్రం సిబ్బంది 60 మందికీ కోవిషీల్డ్‌ టీకాలు వేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఎండీ. షకిల్‌ ఆమ్మేర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందు చూపుతో కరోనా మహమ్మారి నుండీ రాష్ట్రాన్ని కాపాడుకోగలిగామన్నారు.

వ్యాక్సిన్‌ను ఒక తపస్సుతో, ఒక యజ్ఞంలా భావించి ప్రజల ఆరోగ్యం కోసం దేశ సౌభాగ్యం కోసం రూపొందించారని, సంవత్సర కాలం పాటు కరోనా వల్ల మనిషికీ మనిషి దూరంగా ఉన్న స్థితిలో నుంచీ మళ్లీ క్రమంగా కోలుకుని మానవత్వం వైపు అడుగులు వేశామని అన్నారు. ఇంతటి కష్ట కాలం లో సైతం ప్రజలకు వైద్య శాఖ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలిస్‌ శాఖలు ప్రజలకు దైర్యన్నిచ్చి.మందులిచ్చి ఆదుకున్నారన్నారు.

ప్రస్తుతం కూడా వారే సామాజిక సైనికుల వలే ముందుండి కరోనా టీకా వేసుకోని ఆదర్శంగా నిలిచారని, అందుకు గాను టీకా తీసుకున్నా వారందరికీ కతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోధన్‌ ఆర్డిఓ రాజేశ్వర్‌, ఎంపిపి.బుద్దె సావిత్రి రాజేశ్వర్‌, ఏఎంసి చైర్మన్‌ అర్చన, వైస్‌ ఎంపీపీ కోట.గంగారెడ్డి, ఎంపీటీసీ సవిత సంజీవ్‌, ఉప సర్పంచ్‌ సరిడే.సాయిలు, రైతు సమన్వయ మండల కన్వీనర్‌ వెంకట్‌ రెడ్డి, మండల వైద్యాధికారులు డాక్టర్‌. రేఖ, మధు సుధన్‌, ఎండీఓ సుదర్శన్‌, మండల తెరాస పార్టీ అధ్యక్షులు సంజీవ్‌ కుమార్‌, డీసీసీబీ డైరెక్టర్‌ శరత్‌, ఐడీసీఎంస్‌ డైరెక్టర్‌ రాజాగౌడ్‌, సహకార సంఘ చైర్మన్‌ శివకాంత్‌, రాజప్ప.పటేల్‌, సాలూర షకిల్‌, మండల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని పరిశీలించిన కలెక్టర్‌

బోధన్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి బుధవారం బోధన్‌ ...

Comment on the article