కామారెడ్డి, జనవరి 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్‌ని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ ఎం.చంద్రకాంత్, అధ్యాపకులు డా.టి.శ్రీనివాస్, శరత్ రెడ్డి, డా.శంకర్, సూపరింటెండెంట్ ఉదయ్ భాస్కర్, దేవేందర్ సన్మానించారు. ఇల్చిపూర్, కామారెడ్డి శివార్లలో గల కాలేజీకి చెందిన భూముల పరిరక్షణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్‌ను కలిసి పూలమొక్క సమర్పించి ధన్యవాదాలు తెలిపారు.
ముళ్ళపొదలు, ఆక్రమణలతో కూడిన ప్రాంతంలోని భూముల రక్షణ కోసం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆధ్వర్యంలో కమిటీ నియమించి తవ్వించిన 1700 మీటర్ల కందకంలో దిమ్మెలు నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021