Breaking News

పెండింగ్‌ ముటేషన్‌లు త్వరగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలో ఉన్న పెండింగ్‌ ముటేషన్‌లను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని జనహిత భవనంలో గురువారం ధరణి రిజిస్ట్రేషన్లపై సమీక్ష నిర్వహించారు.

గ్రామస్థాయిలో వీఆర్‌ఏల ద్వారా రైతులకు అవగాహన కల్పించి స్లాట్‌ బుక్‌ చేసే విధంగా చూడాలని కోరారు. రైతుల పేర్లలో అక్షర దోషాలు ఉన్న వారు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి.యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, ఆర్‌డివోలు రాజా గౌడ్‌, శీను, అధికారులు పాల్గొన్నారు.

Check Also

పంట రుణాల ల‌క్ష్యాన్ని సాధించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పంట బుణాల ల‌క్ష్యాన్ని బ్యాంకర్ల సమన్వయంతో వ్యవసాయ ...

Comment on the article