Breaking News

సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

హైదరాబాద్‌, జనవరి 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. కొత్త ఆయకట్టును సష్టించడంతో పాటు, నాగార్జున సాగర్‌ ఆయకట్టును కూడా కలుపుకుని పది లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టును అత్యంత ముఖ్యమైనదిగా భావించాలని సీఎం అన్నారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.

మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకష్ణ రావు, సిఎం కార్యదర్శి స్మితా సభర్వాల్‌, ఇఎన్సీలు మురళీధర్‌ రావు, హరేరామ్‌, సిఇలు వెంకట కష్ణ, శంకర్‌ నాయక్‌, మధు సూదన్‌ రావు, ఎస్‌.ఇ. శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌ రెడ్డి, హరిప్రియ, సండ్ర వెంకట వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

అటు గోదావరి, ఇటు కష్ణా నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ప్రభుత్వం సీతారామ ఎత్తిపోతల పథకం మంజూరు చేసిందని, దుమ్ముగూడెం పాయింట్‌ వద్ద గోదావరి నదిలో ఏడాది పొడవునా పుష్కలమైన నీరు అందుబాటులో ఉంటుందని, ఈ నీటి ద్వారా ఖమ్మం జిల్లా యావత్తు నీరు అందించవచ్చన్నారు.

దుమ్ముగూడెం నుంచి నీటిని ఎత్తి పోసి, అటు ఇల్లందు వైపు, ఇటు సత్తుపల్లి వైపు, మరోపక్క పాలేరు రిజర్వాయర్‌ కు లిఫ్టులు, కాల్వల ద్వారా నీటిని తరలించాలని, సత్తుపల్లి, ఇల్లందు వైపు వెళ్లే కాలువలకు సంబంధించిన మిగిలిన పనుల సర్వే వెంటనే పూర్తి చేసి, టెండర్లు పిలవాలన్నారు. మున్నేరు, ఆకేరు వాగులపై అక్విడెక్టులను నిర్మించి, పాలేరు రిజర్వాయర్‌ వరకు కాల్వల నిర్మాణాన్ని జూన్‌ కల్లా పూర్తి చేయాలని, కష్ణా నదిలో నీళ్లు ఎప్పుడుంటాయో, ఎప్పుడుండవో తెలియదన్నారు. అంతా అనిశ్చితి ఉంటుందని, కష్ణా నది ద్వారా నీరు అందని సమయంలో గోదావరి నుంచి తెచ్చే నీటి ద్వారా సాగర్‌ ఆయకట్టుకు నీరందించడానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని సీఎం చెప్పారు.

Check Also

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త

హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయ, పోలీసులతో పాటు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ...

Comment on the article