నిజామాబాద్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నగరంలోని 17వ డివిజన్ గౌతమ్ నగర్ కమ్యూనిటీ హల్లో తడిపొడి చెత్త నిర్వహణపై మహిళలకు మెప్మ సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ తన ఇంటి నుండే తడిపొడి చెత్త వేరు చేయాలని, మన రోజు వారి అవసరాల నుండి వచ్చే తడి చెత్తను ఒక డబ్బాలో, పొడి చెత్తను మరో డబ్బాలో వేరుగా చేయటం ద్వారా ఎరువును తయారు చేయవచ్చన్నారు. వాటిని మన ఇళ్లలో పెంచే మొక్కలకు వాడుకోవచ్చని తెలుపుతూ ఎక్కువ చెత్త ఉంటే దానిని వేరుగా చేసి మున్సిపల్ వాహనాలకు అందించి చెత్త నిర్ములనకు సహకరించాలన్నారు.
రోడ్లపైన, డ్రైనేజీలలో వేయకుండా చూడాలని తెలిపారు. తడిపొడి చెత్తను ఒకే దగ్గర వేయటం ద్వారా కలిగే నష్టాలను ప్రజలకు మేయర్ వివరించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మాయవార్ సవిత, మున్సిపల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ షోయబ్, సానిటరి ఇంచార్జి ఇన్స్పెక్టర్ ప్రశాంత్, సునీల్, ఆర్.పి శోభ, సి.ఓ లు సవిత, హారిక మహిళ సంఘాల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021