కామారెడ్డి, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో గజానాన్ పటేల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నిక అయినందుకు కామారెడ్డి పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గుడుగుల శ్రీనివాస్, ఎల్లారెడ్డి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సంపత్ గౌడ్, బాన్సువాడ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి కలిసి జిల్లా యువజన అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కానీ మీరు మమ్మల్ని సంప్రదించకుండా స్వయంగా మీరు సొంతంగా నిర్ణయం తీసుకుని ఒంటెద్దు పోకడలకు వెళ్లి మాకు ఎవరికీ తెలవకుండా 24వ తేదీన సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. తాము కూడా ఇలాంటి సన్మాన కార్యక్రమాలను ఈ సమయంలో చేసుకోవడం బాగుండదని రద్దు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం దేశం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సన్మాన కార్యక్రమాలు పెట్టుకునే సమయం కాదని, ఒక పక్క కేంద్ర ప్రభుత్వంరైతు చట్టం తీసుకువచ్చి రైతులను రోడ్డుపాలు చేసిందని, మరో పక్క రైతులు 60 రోజుల నుండి చలిని లెక్కచేయకుండా ధర్నాలు దీక్షలు చేస్తున్నారన్నారు.
దాదాపు 70 మంది రైతులు పిట్టల్లా రాలిపోయారని, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాడాల్సిన సమయంలో మనకు సన్మానాలు అవసరమా? అని ప్రశ్నించారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం రైతుల పండించిన పంటను కొనకుండా, కొనుగోలు కేంద్రాలు ఎత్తి వేస్తున్నదని, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్న సమయంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. పేదలు ఆకలితో అలమటిస్తున్న వేళ సన్మానాలు చేసుకుంటూ కూర్చుంటే ప్రజలకి మనపై చులకన భావం ఏర్పడుతుందన్నారు.
ఇప్పుడు సన్మానాలకు సమయం కాదని, ప్రజల పక్షాన నిలబడి ప్రజల కొరకు పోరాడే సమయమిది అన్నారు. గత నెలలో స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ తన జన్మదిన వేడుకలను కూడా రద్దు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రజల పక్షాన పోరాడుతున్నారని వారిని స్ఫూర్తిగా తీసుకొని సన్మాన కార్యక్రమం రద్దు చేసు కోవాలని సూచించారు. ప్రజల పక్షాన పోరాడే కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా యువజన అధ్యక్షున్ని కోరుతున్నామన్నారు.
ఇలా ఎందుకు జరుగుతుందో కాంగ్రెస్ నాయకులకు అర్థమవుతుందని, గత 30 సంవత్సరాల నుండి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణగా అందరూ కలిసి పోరాటం చేసే వాళ్ళం కొందరు కోవర్ట్ నాయకులు గ్రూపులు కట్టి కాంగ్రెస్ పార్టీలో చీలిక తీసుకు వచ్చి పార్టీని బలహీనపరచడానికి చేస్తున్న కుట్రగా దీన్ని భావిస్తున్నామన్నారు. ఇప్పటికైనా సన్మాన కార్యక్రమం రద్దు చేసుకోవాలని తాము కోరుతున్నామన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021