నిజామాబాద్, జనవరి 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొద్దిపాటి చర్యలవల్ల యాక్సిడెంట్లు తగ్గించగలుగుతామంటే అంతకన్నా సంతోషం ఏమీ లేదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ కమిటీ సమీక్ష సమావేశం కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలను తగ్గించడానికి చిన్నపాటి ఏర్పాట్లతో కొంత ఖర్చుతో చర్యలు తీసుకోవడం వల్ల లైఫ్ సేపు అవుతుందనీ, బ్లాక్ స్పాట్స్ జాయింట్ ఇన్స్పెక్షన్స్ ట్రాన్స్ పోర్ట్, పోలీస్, ఇంజనీరింగ్ శాఖలతో సంయుక్తంగా చేయాలని ఆదేశించారు. సంయుక్త విచారణ రిపోర్టు ఫిబ్రవరి 7వ తేదీ లోపు సమర్పించాలన్నారు. రిపోర్టులను బట్టి సెల్ కాన్ఫరెన్సు నిర్వహించి రాటిఫికేషన్ ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.
ప్రమాద కేసులను జిజిహెచ్, నిజామాబాద్‌కు ఎక్కువ రిఫర్ చేసే అవకాశం ఉందని వెంటనే చికిత్స అందించుటకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. బాల్కొండ, మోర్తాడ్‌కు సంబంధించి బాల్కొండ ఆరోగ్య కేంద్రంలో యాక్సిడెంట్ చికిత్సలకు కావలసిన ప్లాన్ చేసుకోవాలని ఆదేశించారు. 108 అంబులెన్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో దగ్గర వర్క్ చేయాలని ఆదేశించారు. ఏవైనా యాక్సిడెంట్ జరిగితే అటెండ్ కావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
కాల్ చేసిన వెంటనే రెస్పాండ్ కావాలని లేకుంటే పదినిమిషాలు ఆలస్యం చేసినా ప్రాణం పోయే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్, ఉమ్మడి జిల్లా డిటిసి డాక్టర్ వెంకట రమణ, అడిషనల్ డిసిపి అరవింద్ బాబు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021