Breaking News

విద్యాసాగర్‌ రావు దిష్టిబొమ్మ దగ్దం

బీర్కూర్‌, జనవరి 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నసురులాబాద్‌ మండల కేంద్రంలో, బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్య సాగర్‌ రావు దిష్టి బొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు హన్మాండ్లు యాదవ్‌ మాట్లాడుతు హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా మాట్లాడం సిగ్గు చేటని, ఆయన భారతదేశం సంస్కతి సంప్రదాయాలు కించపరిచే విధంగా మాట్లాడం భారత దేశ ఐక్యతను దెబ్బ తీసేలా ఉన్నాయన్నారు.

ఇలాంటి దేశ ద్రోయి తన మాటలను వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం అసెంబ్లీ నియోజకవర్గ కన్వినర్‌ కూనింటి రామ్‌, ప్రధాన కార్యదర్శి సంజీవులు, పార్టీ సీనియర్‌ నాయకులు వడ్ల సతీష్‌, సత్యనారాయణ, గంగాధర్‌ గుప్తా, కిసాన్‌ మోర్చా అధ్యక్షులు పెరిక రాములు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సాయికుమార్‌, ఎస్టీ మోర్చా దేవిసింగ్‌, హరి ప్రసాద్‌, అరిగే గంగాధర్‌, సాయి కుమార్‌, సాయి, మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి

బీర్కూర్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెంచిన విద్యుత్ ధరల‌కు వ్యతిరేకంగా టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ...

Comment on the article