24 గంటల పాటు నడిపించి లక్ష్యాలు పూర్తి చేయాలి

కామారెడ్డి, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 28 లోగా రైస్‌ మిల్లుల యజమానులు వడ్లను మర పట్టించడం (మిల్లింగ్‌) ను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ రైస్‌ మిల్లు యజమానులను ఆదేశించారు. శనివారం కలెక్టర్‌ చాంబర్లో రైస్‌ మిలర్లతో జిల్లా కలెక్టర్‌ టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు.

యాసంగి మిల్లింగ్‌ లక్ష్యాలను పూర్తి చేయని యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్‌ మిల్లులను 24 గంటలపాటు నడిపించి లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు. టెలీ కాన్ఫరెన్సులో డీఎస్‌ఓ కొండలరావు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article