Breaking News

విజయ డైరీ 30 శాతం రాయితీ ఇస్తుంది

కామారెడ్డి, జనవరి 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ యువత ఆర్థికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ శరత్‌ అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్‌లో విజయ డైరీ ఆధ్వర్యంలో ఈ కార్ట్‌ డెమో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతలు, జాతర్లు జరిగే చోట వాహనంపై పాల పదార్థాలు తీసుకెళ్లి విక్రయించు కోవాలని సూచించారు. బ్యాటరీతో ఆటో నడుస్తుందని, 10 గంటల పాటు ఛార్జింగ్‌ పెడితే ఆరు గంటలపాటు ఈ కార్ట్‌ పనిచేస్తోందని తెలిపారు.

వాహనం ధర రూ.2.25 లక్షలు ఉంటుందని, విజయ డైరీ 30 శాతం రాయితీ ఇస్తుందన్నారు. రూ.67 వేల 500 ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, విజయ డైరీ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, ఇన్చార్జి మేనేజర్‌ వైష్ణవి, జిల్లా పశువైద్యాధికారి జగన్నాథ చారి, మార్కెటింగ్‌ సూపర్‌వైజర్‌ యశ్పల్‌, రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Check Also

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి 26 వార్డ్‌ లో సోమవారం మున్సిపల్‌ నిధులు ...

Comment on the article