టెట్‌ పై అవగాహన

కామారెడ్డి, జనవరి 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కర్షక బిఎడ్‌ కళాశాలలో ఆదివారం అవనిగడ్డ కోచింగ్‌ సెంటర్‌ టెట్‌ ఉచిత డెమో తరగతులు నిర్వహించారు. టెట్‌ ఉచిత కోచింగ్‌కు అభ్యర్థులు హాజరయ్యారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి పట్టణ ప్రాంత నిరుద్యోగ యువతకు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేపడుతుందని, కామారెడ్డి పట్టణ విద్యార్థులకు ఉచితంగా అవనిగడ్డ అధ్యాపకులచే తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు.

దీనిని నిరుద్యోగ సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే నోటిఫికేషన్లకు విద్యార్థిని విద్యార్థులందరు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. అవనిగడ్డ వారు కామారెడ్డిలో కోచింగ్‌ సెంటర్‌ నిర్వహించడం అభినందనీయమని కామారెడ్డి ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని అలాగే 25 వ తేదీ ఉచిత తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కామారెడ్డి అవనిగడ్డ కోచింగ్‌ సెంటర్‌ డైరెక్టర్‌ హన్మంతు రెడ్డి, చిలుక సత్యనారాయణ, చెలిమెల భాను ప్రసాద్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు శ్రీకాంత్‌ రెడ్డి, అజయ్‌, బాల్‌ నర్సయ్య, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article