జిల్లాలో నాలుగు కొత్త బార్లు

కామారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో నాలుగు కొత్త బార్ల కోసం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి జి.శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి, బాన్సువాడ మున్సిపాలిటీకి సంబంధించి రెండు, ఎల్లారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి ఒకటి చొప్పున మొత్తం నాలుగు కొత్త బార్ల కోసం ఈనెల 25 వ తేదీ నుండి ఫిబ్రవరి 8 వ తేదీ వరకు ఆఫీసు పని దినములలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా మద్య నిషేధ ఆబ్కారీ అధికారి కామారెడ్డి కార్యాలయము, డిప్యూటీ కమిషనర్‌, నిజామాబాదు మద్యనిషేధ అబ్కారీ కార్యాలయము, మద్య నిషేధ, అబ్కారీ కమిషనర్‌ కార్యాలయము, నాంపల్లి, హైదరాబాదు కార్యాలయములలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు.

ఫిబ్రవరి, 10 వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరు సమక్షములో డ్రా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం కొరకు జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి, కామారెడ్డి కార్యాలయంలో సంప్రదించాలని ఆయన అట్టి ప్రకటనలో తెలిపారు

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article