ఫిబ్రవరి 20 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యాసంగి వడ్లు మర పట్టించడం (మిల్లింగ్‌) ఫిబ్రవరి 20లోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ తెలిపారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో రైస్‌ మిల్లు యజమానులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు.

మిల్లింగ్‌ చేయడంలో అలసత్వం ప్రదర్శించే రైస్‌ మిల్‌ యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిల్లింగ్‌ పూర్తి కాకపోతే సంబంధిత ఉప తహసిల్దారుపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్సులో డీఎస్‌ఓ కొండలరావు, సివిల్‌ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్‌, రైస్‌ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article