ఫిబ్రవరి 3 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఫిబ్రవరి 3 లోగా పంటల నమోదు పూర్తి చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో టెలీ కాన్ఫరెన్సులో వ్యవసాయ అధికారులతో పంటల నమోదు ప్రక్రియను సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు 50 శాతం మాత్రమే క్రాప్‌ బుకింగ్‌ జరిగిందని చెప్పారు. వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో పర్యటించి ప్రతి గుంటలో వేసిన పంటలను నమోదు చేయాలని ఆదేశించారు.

రైతు బంధు సమితి సభ్యులతో వ్యవసాయ విస్తరణ అధికారులు చర్చించి, రైతు వేదికలను స్థానిక ఎమ్మెల్యేలతో మూడు రోజుల్లో ప్రారంభించాలని సూచించారు. అవసరమైన ఫర్నిచర్‌ను సమకూర్చుకోవాలన్నారు. రైతు బీమా సెటిల్మెంట్‌ పెండింగ్‌లో లేకుండా చూడాలని కోరారు.

రైతు బీమా వివరాలు అప్‌లోడ్‌ చేయడంలో వ్యవసాయ అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టెలీ కాన్ఫరెన్సులో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా వ్యవసాయ అధికారిని సునీత, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article