బోధన్, జనవరి 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీనియర్ ఐఏఎస్ అధికారి / ఎన్ఆర్ఈజీఎస్ జాయింట్ సెక్రటరీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో కేంద్ర బందం నిజామబాద్ జిల్లాలో పర్యటించి ఉపాధి హామీ పనులు పరిశీలించారు. బుధవారం కేంద్ర బందం పర్యటనలో భాగంగా అమరేందర్ ప్రతాప్ సింగ్ డైరెక్టర్, కార్తీక్ పాండే టెక్నికల్, రఘునందన్ రావు ఐఏఎస్, కమిషనర్ / పిఆర్ అండ్ ఆర్డి (తెలంగాణ) సైదులు ఐఎఫ్ఎస్, స్పెషల్ కమిషనర్ ఆర్డి, వి.ఎన్.ఎస్ ప్రసాద్ ఐఎఫ్ఎస్, స్పెషల్ కమిషనర్ ఆర్డి, జగత్ రెడ్డి జాయింట్ కమిషనర్ ఆర్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఎన్ఆర్ఈజీఎస్ పనులు, రికార్డులు పరిశీలించారు.
ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీ ఫీడర్ ఛానల్ చూసి అందులో దాదాపు 20 మంది ఉపాధి హామీ లేబర్ పనిచేస్తుండగా లేబర్తో జాబ్ కార్డులు పరిశీలించి వారితో పని కొలత, వేతనం గురించి అడిగి తెలుసుకున్నారు. ఉదయం ఎన్ని గంటలకు పనికి వస్తున్నారో, ఇంతకుముందు ఎన్ని రోజులు పని చేశారో పని వలన ఊరికి ఉపయోగం ఏమిటి కొలతలు, డబ్బులు సరిగా వస్తున్నాయా తెలుసుకున్నారు. రికార్డులు వెరిఫికేషన్ చేశారు.
లింగంపల్లి ఫార్మేషన్ రోడ్డు పది లక్షలతో బాగుందని ఉపాధి హామీ పథకంలో ఉపయోకరంగా ఉందని సర్పంచ్ తెలుపగా అందుకు సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం పెద్ద చెరువు వద్ద ఉన్న మూడు వర్క్ సైట్ బోర్డ్స్ పరిశీలించారు. కంపోస్ట్ షెడ్ చూసి చాలా బాగుందన్నారు. వేస్ట్ కంపోస్టుతో ఎరువు తయారు చేయడం చూసి షెడ్ వద్ద సంతోషం వ్యక్తం చేశారు. గ్రామసభలో జాబ్ కార్డు పరిశీలించారు.
కార్యక్రమంలో సర్పంచ్ శేఖర్, అడిషనల్ కలెక్టర్ లత, డిఆర్డిఓ శ్రీనివాస్, ఎంపీడీవో సంజీవ్ కుమార్, బాలగంగాధర్ ఎంపీడీవో సాయిలు ఉపాధిహామీ కూలీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- వైకుంఠధామాలు త్వరితగతిన పూర్తిచేయాలి - February 26, 2021
- బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి - February 26, 2021
- పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారి - February 26, 2021