Breaking News

సకాలంలో మిల్లింగ్‌ చేయాలి

కామారెడ్డి, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గడువులోగా మిల్లింగ్‌ పూర్తి చేయని రైస్‌ మిల్లు యజమానులపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జరిగిన టెలీ కాన్ఫరెన్సులో కలెక్టర్‌ రైస్‌ మిల్లు యజమానులతో మాట్లాడారు.

ఫిబ్రవరి 20 లోగా మిల్లింగ్‌ పూర్తి చేస్తామని రైస్‌ మిల్లుల యజమానులు (హామీపత్రం రాసి దానిపై సంతకం చేసి) అండర్‌ టేకింగ్‌ ఇవ్వాలని సూచించారు. యాసంగిలో పండించిన వడ్లను గడువులోగా మిల్లింగ్‌ చేయని రైస్‌ మిల్లు యజమానులకు అపరాధ రుసుము వసూలు చేస్తామని హెచ్చరించారు. వడ్లను సకాలంలో మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని గోదాంకు తరలించాలని పేర్కొన్నారు.

Check Also

పంట రుణాల ల‌క్ష్యాన్ని సాధించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పంట బుణాల ల‌క్ష్యాన్ని బ్యాంకర్ల సమన్వయంతో వ్యవసాయ ...

Comment on the article