చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జనవరి 27

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 17 లక్షల 11 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 557 మందికి 3 కోట్ల 67 లక్షల 75 వేల రూపాయల చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఇది ఏంతో ఉపయోగపడుతుందన్నారు.

Check Also

విపత్తుశాఖ వారి మోబైల్‌ యాప్‌ ప్రారంభం

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విపత్తు శాఖ ద్వారా ప్రచురితమైన ...

Comment on the article